స్టార్ హీరో కొడుకుతో కూతురు పెళ్లిపై అసలు విషయం చెప్పిన నటి హేమ..!

Divya
టాలీవుడ్ లో నటిగా పేరు సంపాదించిన హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హేమ ఎలాంటి విషయాలనైనా సరే మొహమాటం లేకుండా చెప్పేసే స్వభావం కలదు. అందుకే నిరంతరం ఏదో ఒక వార్తలలో ఈమె పేరు వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన కూతురు ఈషా వివాహంపై వస్తున్న రూమర్స్ పైన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


హేమ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కూతురు ఈషా వయసు ప్రస్తుతం 24 సంవత్సరాలని ఇప్పుడే పెళ్లి చేయాలనే ఆలోచన ఏమీ లేదు. కనీసం 26 ఏళ్లు వచ్చిన తర్వాత సంబంధాలు చూస్తామంటూ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతోందనే వార్తలు కేవలం రూమర్సు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇండస్ట్రీలోనే వివాహం చేస్తారా బయట వ్యక్తిగా అనే సమాధానం పై మాట్లాడుతూ.. మంచి వ్యక్తి అయితే చాలు ఇండస్ట్రీలోనైనా బయటైనా సరే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేసింది హేమ.


అలాగే తన కూతురు గురించి మాట్లాడుతూ.. ఈషా జాబ్ చేస్తోందని రోజు ఆటోలోనే ఆఫీసుకు వెళ్తుంది. బిజినెస్ చేయాలని ఆమెకు చాలా ఆసక్తి ఉంది కానీ ఉద్యోగం చేస్తే జీవితం అర్థమవుతుందని చెప్పానని జాబ్ చేస్తేనే అనుభవం వస్తుందని అందుకే తనని జాబ్ చేయమని ప్రోత్సహించాను అంటూ తెలిపింది హేమ. అలాగే ఇంటి పనులలో కూడా తనకి చాలా తోడుగా ఉంటూ చురుకుగా ఉంటుందని ముఖ్యంగా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సమయంలో తన కూతురే వంటకు పంపిస్తుందని తెలియజేసింది. అలాగే తనకు తన భర్తకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తాము విడిపోయామని వార్తలు కేవలం రూమర్సు మాత్రమే అంటూ ఖండించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: