రామ్ చరణ్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్..గాయం వల్ల పెద్ది వాయిదా..?
పెద్ది సినిమా షూటింగ్లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. అయితే రామ్ చరణ్ కంటికి అయిన గాయం చిన్నదబ్బడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు సైతం సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. కేవలం రెండు రోజులు మాత్రం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు కూడా సూచించారట. ఈ విషయం విన్న అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు వెంటనే రామ్ చరణ్ ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. అందుకు సంబంధించి ట్విట్టర్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది..
ఇప్పటికే పెద్ది సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు సినిమా అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద సినిమాలో నటించిన రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం కూడా పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 30వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది. గతంలో ఎన్నో పాత్రలలో నటించిన రామ్ చరణ్ పెద్ది సినిమాలో మాత్రం చాలా విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఇందులో జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. పెద్ది సినిమా అయిపోయిన తర్వాత డైరెక్టర్ సుకుమార్ తో ఒక సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్.