"ఉస్తాద్ భగత్ సింగ్" లో ఆ పాత్రను లేపేసారా..? పవన్ ఎందుకు అలా చేశారు..?

Thota Jaya Madhuri
 పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇటీవల బయటకు వచ్చింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్, సినిమాలో ఒక ప్రత్యేకమైన విలన్ పాత్ర కోసం భిన్నమైన వ్యక్తిని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి గారిని సంప్రదించారని వార్తలు వినిపించాయి.హరీష్ శంకర్ ఆలోచన ప్రకారం, మల్లారెడ్డి గారితో ఒక కామెడీ టచ్ ఉన్న విలన్ పాత్ర చేయిస్తే అది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని భావించారట. ఆయన స్టైల్, మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్ అన్ని కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని దర్శకుడు అంచనా వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ పాత్రలో కామెడీతో పాటు కొంత నెగిటివ్ షేడ్స్ ఉండేలా డిజైన్ చేశారని అంటున్నారు.

అయితే ఈ ఆఫర్‌ను మల్లారెడ్డి గారు వినయంగా తిరస్కరించినట్లు ఆయన స్వయంగా పలు సందర్భాల్లో వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రధాన కారణం ఏమిటంటే ..సినిమాల్లో విలన్ పాత్ర ఎంత గొప్పగా ఉన్నా, చివరికి హీరో చేతిలో ఓడిపోవాల్సిందే. అంటే, ప్రేక్షకుల ముందర హీరో చేతిలో దెబ్బలు తినే సన్నివేశాలు తప్పవు. అలాంటి సన్నివేశాల్లో కనిపించడం తన ఇమేజ్‌కు సరిపోదని భావించి, ఆ పాత్రను చేయనని స్పష్టంగా చెప్పారట.అసలు విషయానికి వస్తే, మల్లారెడ్డి గారు ఈ పాత్రను ఒప్పుకున్నట్లయితే, అది సినిమాకు ఒక ప్రత్యేక హైలైట్‌గా మారే అవకాశం అయ్యుండేది. ఆయన ప్రత్యేక శైలి వల్ల ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చేదని చిత్రబృందం కూడా భావించిందట. ముఖ్యంగా కామెడీ విలన్‌గా ఆయన కనిపిస్తే ప్రేక్షకులు కొత్తగా ఎంజాయ్ చేసేవారని అనుకున్నారు.

కానీ ఆయన తిరస్కరించడంతో, ఆ పాత్రను పూర్తిగా సినిమాకే తీసివేసినట్లు సమాచారం. అంటే, మొదట ప్లాన్ చేసిన ఆ ట్రాక్ మొత్తాన్ని స్క్రిప్ట్ నుంచే తొలగించారని తెలుస్తోంది. మొత్తానికి, ఒక ఆసక్తికరమైన పాత్ర ప్రేక్షకుల ముందుకు రాకుండా పోయింది అనే భావన ఉన్నా, అదే సమయంలో మల్లారెడ్డి గారి నిర్ణయం ఆయన వ్యక్తిగత ఇమేజ్‌కు అనుగుణంగా తీసుకున్నదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: