స్టేజ్ పై దురంధర్ హీరోయిన్ ముద్దు వివాదం.. అసలు విషయం చెప్పిన దురంధర్ నటుడు..!

Divya
బాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య మార్చి 19వ తేదీన విడుదలైన చిత్రం దురంధర్ 2. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, రణవీర్ సింగ్ హీరోగా,సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా రూ .500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రోజురోజుకి దురంధర్ 2 సినిమా క్రేజ్ కూడా పెరుగుతూనే ఉంది. ఈ సినిమాలో జమీల్ జమాలి పాత్రలో నటించిన నటుడు రాకేష్ బేడీ తన నటనతో ప్రశంసలు అందుకున్నారు.


కరాచీకి చెందిన రాజకీయ నాయకుడిగా జమాలి పాత్రలో అద్భుతంగా నటించిన రాకేష్ ఇటీవల దురంధర్ ట్రైలర్ వేడుకలో ఆయన చేసిన పని వల్ల తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి. ఈ వేడుకలో హీరోయిన్ సారా అర్జున్ భుజం పైన ముద్దు పెట్టుకోవడం వివాదానికి మరింత దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తనకంటే వయసులో చాలా చిన్నదైనా సారా అర్జున్ ను ఇలా ముద్దు పెట్టుకోవడంపై రాకేష్ బేడీ పై చాలానే ట్రోల్స్ వస్తున్నాయి.


ఈ ముద్దు వివాదం పైన రాకేష్ స్పందిస్తూ.. తనకు సారా పైన ఎలాంటి చెడు ఉద్దేశం లేదని కేవలం తనపైన ఆప్యాయం ఉండడం వల్లే అలా చేశానంటూ ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు. సినిమా షూటింగ్ సమయంలో నా కూతురు పాత్రలో నటించిన సారా అర్జున్ షూటింగ్ వచ్చిన సమయంలో ఆమెను ప్రతిసారి నేను కౌగిలించుకొని నుదుటిపైన ముద్దు పెట్టుకునే వాడిని ఒక కూతురిగా టెన్షన్ పడకు మనం కలిసి ఒక గొప్ప సినిమా చేస్తున్నామని చాలాసార్లు చెప్పానని, అదేవిధంగా ట్రైలర్ ఈవెంట్ లో కూడా తాను పలకరించినప్పుడు జనాలు రకరకాలుగా మాట్లాడుతున్నారని, ఆ వీడియోని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు సారా ఎప్పటికీ తన కూతురే అంటూ తెలియజేశారు రాకేష్ బేడీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: