బాలయ్యకు అరుదైన గౌరవం..నందమూరి ఫ్యాన్స్ కలలో కూడా మర్చిపోలేని మూమెంట్ ఇది..!

Thota Jaya Madhuri
టాలీవుడ్‌కు చెందిన సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్రను వేసి, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన “లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్” అవార్డు లభించడం విశేషం.దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం  లో ఘనంగా నిర్వహించిన ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ డిల్లీ 2026 వేడుకల్లో ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. బుధవారం సాయంత్రం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను మరింత వైభవంగా తీర్చిదిద్దారు.

సినీ రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న తన ప్రయాణంలో బాలకృష్ణ అనేక సూపర్ హిట్ చిత్రాలను అందించారు. పౌరాణికం, సామాజికం, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ వంటి విభిన్న జానర్లలో నటిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. తన నటనతో మాత్రమే కాకుండా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.ఈ విశిష్టమైన కృషిని గుర్తిస్తూ ఈసారి నిర్వాహకులు ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ గౌరవాన్ని అందుకోవడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ, తనకు లభించిన ఈ గౌరవం తనకే కాకుండా మొత్తం తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు తెలిపారు. అభిమానులు, దర్శకులు, నిర్మాతలు, సహనటులు అందరి సహకారమే తన విజయానికి కారణమని వినయంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మంచి కథలతో ప్రేక్షకులను అలరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.ఈ అవార్డు ద్వారా ఆయన సినీ జీవితానికి మరో మైలురాయి చేరింది. తెలుగు సినిమా గౌరవాన్ని జాతీయ స్థాయిలో మరింత పెంచిన ఈ ఘనతపై అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: