రూమర్లపై ఫైర్ అయిన సాయి పల్లవి.. క్లియర్ స్టేట్‌మెంట్!
సాయి పల్లవి చెల్లెలు పూజా పల్లవి వివాహం ఘనంగా జరగడంతో, అందరి దృష్టి 33 ఏళ్ల సాయి పల్లవిపై పడింది. నెటిజన్లు “మరి అక్క పెళ్లి ఎప్పుడు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న సాయి పల్లవి మాట్లాడుతూ.. "ప్రస్తుతం నా పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంది. పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పట్లో లేదు. నేను ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నాను, దయచేసి రూమర్లు నమ్మకండి" అని తేల్చి చెప్పారు.కేవలం ఎక్స్‌పోజింగ్‌కే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకునే సాయి పల్లవి, తన పర్సనల్ లైఫ్ విషయంలో కూడా అంతే స్ట్రిక్ట్‌గా ఉంటారని మరోసారి ప్రూవ్ చేశారు.
సాయి పల్లవి చేతిలో ఇప్పుడు గ్లోబల్ లెవల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ‘హైబ్రిడ్ పిల్ల’ బాక్సాఫీస్ దగ్గర దండయాత్రకు సిద్ధమైంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ చిత్రం‘రామాయణ’లో రణబీర్ కపూర్ సరసన సీతగా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్!అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ‘ఏక్ దిన్’ అనే ప్రేమకథా చిత్రంతో బాలీవుడ్‌ను షేక్ చేయడానికి రెడీ అయ్యింది.అటు మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది.సాయి పల్లవి తన నటనతో ప్యాన్ ఇండియా లెవల్లో జెండా ఎగురవేస్తోంది.