శ్రీదేవి మరణం పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
అల శ్రీదేవి గురించి మాట్లాడుతూ ఆమెలాంటి చావు మరెవరికి రాకూడదని ఆయన అత్యంత బాగోద్వేగంగా తెలియజేశారు. తన చివరి చిత్రం మామ్ ఆడియో ఫంక్షన్ లో శ్రీదేవి తన కాళ్లపై పడి నమస్కరించి మళ్లీ మనం కలిసి ఒక సినిమా చేద్దామని తనని అడిగిందని గుర్తుకు చేశారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద స్థితిలో మరణించడం తనని తీవ్రంగా కలిచివేసిందంటూ తెలియజేశారు డైరెక్టర్ రాఘవేంద్రరావు. అంత గొప్ప నటి ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన శ్రీదేవి అలా దేవలోకానికి వెళ్ళిపోకుండా ఉండాల్సింది. ఆమె చావు మరెవరికి రాకూడదు అంటూ కన్నీరు పెట్టుకున్నారు డైరెక్టర్ రాఘవేంద్రరావు. దీంతో ఈ విషయం విన్న శ్రీదేవి అభిమానులు కూడా డైరెక్టర్ రాఘవేంద్రరావు పైన ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీదేవి వారసురాలుగా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ లో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన శ్రీదేవి లాగా కూతురు జాన్వీ కపూర్ స్టార్ స్టేటస్ ని అందుకుంటుందేమో చూడాలి.