శర్వా కెరీర్‌లోనే మరో డిఫరెంట్ రోల్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
శ్రీను వైట్ల సినిమాల్లో కామెడీ ఎంత ఫేమస్సో, హీరోల మేకోవర్ కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ‘జార్జ్ క్రిష్’ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నారు.ఈ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో శర్వానంద్ 60 ఏళ్ల వృద్ధుడి పాత్రలో కనిపించబోతున్నారట. దాదాపు రెండు కీలకమైన ఎపిసోడ్స్‌లో ఈ లుక్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. గతంలో కూడా శర్వా కొన్ని సినిమాల్లో వృద్ధుడిగా మెప్పించినా, ఈసారి శ్రీను వైట్ల మార్క్ యాక్షన్ కామెడీలో ఆ గెటప్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ‘బైకర్’ కోసం బాగా సన్నబడ్డ శర్వా, ఇప్పుడు ఈ వృద్ధుడి పాత్ర కోసం మళ్లీ తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోబోతున్నారు . .
గోపీచంద్ ‘విశ్వం’ చిత్రంతో యావరేజ్ రిజల్ట్ అందుకున్న శ్రీను వైట్ల, ఈసారి ఎలాగైనా తన పాత వైభవాన్ని చాటుకోవాలని కసితో ఉన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్‌లోనే శర్వానంద్ ఎంట్రీ సీన్స్‌ను ప్లాన్ చేశారట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శ్రీను వైట్ల మార్క్ పంచ్ డైలాగులు, శర్వానంద్ టైమింగ్ తోడైతే థియేటర్లలో నవ్వుల జాతర ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.