కిరణ్ అబ్బవరం మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్..ఫ్యాన్స్‌కు షాక్!

Amruth kumar
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర తన గేర్ మార్చారు. ‘రాజా వారు రాణి గారు’తో సాఫ్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ రాయలసీమ కుర్రాడు, ఇప్పుడు వరుస హిట్లతో ‘మినిమమ్ గ్యారంటీ’ హీరోగా తన మార్కెట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లారు. కిరణ్ అబ్బవరం కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అనేలా ఆయన లైనప్ కనిపిస్తోంది. ఏకంగా అరడజను ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోగా మారిపోయారు. . 



కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాకుండా, డిజిటల్ ప్లాట్‌ఫామ్ వైపు కూడా కిరణ్ అబ్బవరం ఒక పక్కా స్కెచ్ వేశారు. ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ కోసం ‘గువ్వలచెరువు ఘాట్’ అనే భారీ వెబ్ సిరీస్‌లో కిరణ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే నెట్టింట పూనకాలు తెప్పించింది. ఇందులో కిరణ్ మునుపెన్నడూ చూడని ఒక రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించబోతున్నారు. కిరణ్ నుంచి రాబోతున్న మరో కమర్షియల్ ఎంటర్టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. లవ్, ఎమోషన్ మరియు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. . 



కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన వీర కోగటం దర్శకత్వంలో కిరణ్ ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో కిరణ్ క్యారెక్టరైజేషన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్.అందరినీ ఆశ్చర్యపరుస్తూ కిరణ్ అబ్బవరం త్వరలోనే మెగా ఫోన్ పట్టబోతున్నారు. . స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే సిద్ధం చేసుకున్న ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా తన ప్రతిభను చాటుకోనున్నారు. నటుడిగానే కాకుండా టెక్నీషియన్‌గా కూడా కిరణ్ తన సత్తా చాటడానికి రెడీ అయ్యారు. . 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: