మెగా డాటర్ క్లారిటీ.. ఎవరు ఏమన్నా నా పని నేనే చేస్తా!

Amruth kumar
మెగా ఫ్యామిలీ నుంచి యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, నేడు టాలీవుడ్‌లో ఒక సక్సెస్‌ఫుల్ అండ్ డేరింగ్ నిర్మాతగా రాణిస్తున్నారు నిహారిక కొణిదెల. తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. అయితే, ఆమె తీసుకునే ప్రతి నిర్ణయంపై విమర్శలు రావడం కామన్ అయిపోయింది. తాజాగా తాను నిర్మించిన ‘రాకాస’ (Raakasa) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఈ విమర్శలపై నిహారిక చాలా ఘాటుగా స్పందించారు.



ఏం చేసినా విమర్శలే.. నా దారి నాదే!:

నిహారిక నిర్మాతగా మారినప్పటి నుండి ఆమె అడుగులను ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ‘రాకాస’ ఈవెంట్‌లో ఆమె తన ఆవేదనను, ధైర్యాన్ని ఒకేసారి బయటపెట్టారు. "నేను 'కమిటీ కుర్రాళ్ళు' చేసినప్పుడు 15 మంది కొత్తవాళ్లను ఎందుకు పరిచయం చేస్తున్నావు? తలనొప్పులు ఎందుకు? అని అడిగారు. తీరా అది నేషనల్ లెవల్ హిట్ అయ్యాక, ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్‌తో 'రాకాస' తీస్తుంటే.. మళ్ళీ పాత తరహా సినిమాలే చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. నేనేం చేసినా నన్ను అనేవాళ్లు ఉంటారు, కానీ నేను నమ్మిన పని చేస్తూనే ఉంటా" అని గట్టిగా చెప్పారు. ప్రతి విషయంలోనూ అడ్డంకులు ఎదురవుతున్నా, నిర్మాతగా తనకున్న విజన్‌తో ముందుకు సాగుతానని, విమర్శలకు భయపడబోనని ఆమె స్పష్టం చేశారు.



అన్నయ్యతో సినిమాపై కూడా కామెంట్స్:

నిహారిక తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను అన్నయ్య వరుణ్ తేజ్‌తో ‘బరి’ అనే పేరుతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయని ఆమె వెల్లడించారు. "చిన్నవాళ్లతో సినిమాలు చేయొచ్చు కదా, అప్పుడే అంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు? ఫ్యామిలీ వాళ్లతో ఎందుకు చేస్తున్నావు?" అని కొందరు ప్రశ్నిస్తున్నారట. కానీ బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మొదలైన ఈ ‘బరి’.. 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఇది ఒక హారర్ కామెడీ విజువల్ వండర్‌గా తెరకెక్కింది. ట్రైలర్ ఇప్పటికే నెట్టింట పూనకాలు తెప్పిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: