మన పూర్వికులు సైతం ఎండాకాలంలో తాగే బాడీ కూల్ జ్యూస్..

Divya
మన పూర్వీకులు సైతం 60 ఏళ్ల 70 ఏళ్ళు వచ్చిన ఎటువంటి రోగాలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్య కారణం వారు తినే ఆహారమని చెప్పవచ్చు. అప్పట్లో ఎక్కువగా రాగి జావా లేదా రాగి అంబలి వంటివి తాగే వారు. ఇది భారతీయ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత కలిగినది. తాగడానికి రుచికరమైనది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు. ఈ రాగి జావా అందించే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. రాగులలో ఫింగర్ మిల్లెట్ వంటి పోషకాలు చాలానే ఉంటాయి. ఇందులో ఫైబర్ క్యాల్షియం వంటివి కూడా ఎక్కువగా లభిస్తాయి. వీటివల్ల ఎముకలు బలంగా ఉండడమే కాకుండా జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి.


ఎండాకాలంలో రాగి జావా తాగడం వల్ల శరీరం చల్లగా ఉండడమే కాకుండా, శరీరంలో తక్కువగా ఉన్న పోషకాలకు శక్తిని అందించేలా చేస్తుంది. ఈ పానీయం పిల్లలు మధుమేహ వ్యాధిగ్రహస్తులు కూడా తాగవచ్చు ఎండాకాలంలో రెగ్యులర్ గా ఈ రాగి జావాని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఈ రాగి జావాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


కావలసిన పదార్థాలు:
రాగి పిండి, మజ్జిగ, ఉప్పు, నీరు


ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో గ్లాసు నీటిని పోసి మరిగించాలి. అలా మరిగిన నీటిలోకి కొంతమేరకు ఉప్పును చేర్చాలి.


ముందుగా తీసి పెట్టిన రాగి పిండిని మరుగుతున్న నీటిలో నెమ్మదిగా పోస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి. అలా ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమం చిక్కబడే వరకు మరిగించాలి.


ఆ తర్వాత రాగి జావా చల్లార్చిన తర్వాత మరింత చిక్కబడుతుంది. ఒక కప్పు పెరుగును తీసుకొని రాగిజావ, మజ్జిగ రెండు మిక్స్ చేస్తే చాలు దీంతో రాగిజావ తయారవుతుంది.


రాగి జావా వల్ల ప్రయోజనాలు ఏమిటంటే.. జీర్ణక్రియ మెరుగుపరచడం, బరువు తగ్గడానికి సహాయం, కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేలా చేస్తుంది. శరీరాన్ని డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: