దేవిశ్రీప్రసాద్ తో విభేదాలపై హరిశంకర్ క్లారిటీ..!
దేవి శ్రీ ప్రసాద్ తన సోషల్ మీడియా అకౌంట్లో హరిశంకర్ ని అన్ ఫాలో చేశారు. సాధారణంగా సెలబ్రిటీలు ఒకరినొకరు అన్ ఫాలో చేయడం వల్ల సినీ ఇండస్ట్రీలో ఇది పెద్ద చర్చకు దారితీస్తుంది. అలాంటిది ఒక దర్శకుడు పుట్టినరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఇలా చేయడం సినీ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. హరీష్ శంకర్, దేవిశ్రీప్రసాద్ మధ్య విభేదాలు రావడానికి ముఖ్య కారణం ఉస్తాద్ భగత్ సింగ్ కారణమన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మొదట ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్ పనిచేయగా ఆ తర్వాత సినిమా బ్యాక్ గ్రౌండ్ కోసం థమన్ ను ఎంపిక చేసుకున్నారు.
దేవిశ్రీప్రసాద్ ఇతర ప్రాజెక్టుల వల్ల బిజీగా ఉండడం వల్ల తమన్ ను తీసుకున్నారని తెలిసి ఫీల్ అయినట్లుగా వినిపించాయి.. హరిశంకర్ వ్యాఖ్యలు దేవిశ్రీప్రసాద్ ని కాస్త ఇబ్బందులకు గురి చేశాయని, అంతేకాకుండా దేవిశ్రీప్రసాద్ పని పైన, సమయం పైన హరిశంకర్ చాలా బహిరంగంగానే మాట్లాడారని ఈ విషయం పైన దేవిశ్రీప్రసాద్ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.దీని వల్లే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని ,దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని అందుకే పరోక్షంగా దేవిశ్రీప్రసాద్ ఇలా సిగ్నల్ చేశారంటూ సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది.