బన్నీ బర్త్‌డే ప్లాన్ లీక్.. ఈసారి ట్విస్ట్ ఇదే!

Amruth kumar
టాలీవుడ్ బాక్సాఫీస్ ‘రేసు గుర్రం’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) అంటే మెగా అభిమానులకు ఒక పెద్ద పండగ. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా బన్నీ బర్త్‌డే సందర్భంగా ఏదో ఒక వీడియో అప్‌డేట్ వస్తుందని, థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ నుంచి టీజర్ లేదా గ్లింప్స్ వస్తుందని అంతా భావించారు. కానీ, తాజాగా మెగా ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఇచ్చిన క్లారిటీతో అభిమానుల అంచనాలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి.



బన్నీ బర్త్‌డే రోజున ఎలాంటి విజువల్ ట్రీట్ ఉండబోవట్లేదని బన్నీ వాసు స్పష్టం చేశారు."నాకు తెలిసినంత వరకు బన్నీ పుట్టినరోజున ఎలాంటి వీడియో కంటెంట్ విడుదల చేసే ఆలోచన చిత్ర యూనిట్‌కు లేదు. ఈసారి టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఒక పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అవుతుంది" అని వెల్లడించారు.ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కావడంతో, మేకర్స్ ఎక్కడా తొందరపడదలచుకోలేదు. ఇప్పుడే విజువల్స్ బయటకు వస్తే సినిమాపై ఉన్న ఉత్సుకత తగ్గిపోవచ్చని భావించి, కేవలం టైటిల్ మరియు పోస్టర్‌తోనే ‘హైప్’ క్రియేట్ చేయాలని ప్లాన్ చేశారు.



ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న మరో హాట్ టాపిక్ అయితే కాస్టింగ్‌ పై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.ఈ సినిమాలో హీరోయిన్‌గా గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తున్నట్లు సమాచారం.జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ మరియు రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారని ప్రచారం సాగుతోంది. ఏప్రిల్ 8న వచ్చే పోస్టర్ ద్వారా ఈ అంశాలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు సైన్స్ ఫిక్షన్ జోనర్ తోడవ్వడంతో, ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మొత్తానికి ఈసారి బన్నీ బర్త్‌ డే సందర్భంగా వీడియో అప్డేట్ లేకపోయినా, టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: