అమరావతి విషయంపై.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!

Divya
ఆంధ్రప్రదేశ్ అమరావతికి చట్టబద్ధత తీర్మానం పైన తాజాగా వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధత కోసం తీర్మానం చేసినప్పుడు మళ్లీ సవరణ చేయలేమా?అదే అసెంబ్లీ తీర్మానం చేసి మార్చుకోలేమా అంటూ జగన్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాలకు ఇష్టమంటూ ఏపీ హైకోర్టులో కూడా కౌంటర్లు దాఖలు చేసింది. తమకు ఈ విషయంలో ఎలాంటి పాత్ర లేదంటూ తెలిపిందని తెలియజేశారు. ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు ఇలాంటి డ్రామాలాడుతున్నారంటూ విమర్శలు చేశారు. దోపిడి నుంచి డైవర్ట్ చేయడానికి ఈ డ్రామాలన్ని ఆడుతున్నారని ఏ ప్రభుత్వమైనా సరే చట్టం చేయగలదు ,చట్టాన్ని మార్చగలదు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వైసీపీ పార్టీ వ్యతిరేకం కాదు అంటూ జగన్ తెలిపారు.


అమరావతి కే కాదు ఏ ప్రాంతానికి తాము వ్యతిరేకం కాదని అన్ని ప్రాంతాలను వైసీపీ పార్టీ సమానంగా చూస్తుందంటూ వివరించారు. అమరావతి ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అంటూ బయటపెట్టారు జగన్. అలాగే రాజధాని ప్లాన్ బి అంటూ సరికొత్త ప్రతిపాదన తీసుకోవచ్చారు మాజీ సీఎం జగన్. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయాలంటూ తెలిపారు. అలాగే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు క్యాపిటల్గా డిక్లరేషన్ చేయాలని 110 కిలోమీటర్ల మీద రాజధాని ప్రాంతంగా ప్రకటించండి అంటూ సూచనలు ఇచ్చారు.


అలాగే కొత్త రాజధానికి "మావిగన్ "పేరు పెట్టండి అంటూ జగన్ సూచించారు.. మచిలీపట్నం(MA), విజయవాడ(VI)గుంటూరు(GUN) వీటన్నిటితో MAVIGUN పేరు పెట్టి 2 లక్షల కోట్లలో 10% ఖర్చు చేస్తే చాలు డెవలప్మెంట్ అవుతుందని చెన్నై, ముంబై లాంటి పోర్టు సిటీగా రాజధాని ఉంటుందంటూ వివరించారు. అంతేకాకుండా చంద్రబాబు అమరావతిలో గతంలో తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ పేరుతో 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పుడు వాటిని పక్కన పెట్టి మరి కొత్త నిర్మాణాలు అంటూ భారీగా ప్రజాధరణ దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. తాత్కాలిక భవనాల కోసం ఖర్చు చేసిన డబ్బులు అన్నీ కూడా ఇప్పుడు వృధాగా పోయాయని మండిపడ్డారు. అమరావతిలో నిర్మిస్తున్న వాటన్నిటి పైన కూడా జగన్ గణాంకాలతో సహా వివరించి విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: