బాలీవుడ్ రామాయణం నుంచి టీజర్ రిలీజ్.. సీతగా సాయి పల్లవి, రాముడిగా రణబీర్..!

Divya
బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రామాయణం. ఇప్పటికే ఈ ఇతిహాసం సినిమా పైన ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. అన్ని చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఇందులో హీరో యష్ రావణాసురుడిగా నటిస్తున్నడమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి కొన్ని లీకుల ఫోటోలు విడుదలవుతూనే ఉన్నాయి.


ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణం సినిమా టీజర్ ని తాజాగా చిత్ర బృందం విడుదల చేశారు. రామాయణ గ్లింప్స్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. రాముడిగా రణబీర్ కపూర్ అద్భుతంగా నటించినట్లు కనిపిస్తోంది రణబీర్ కపూర్. అలాగే సాయి పల్లవి సీత పాత్రలో అద్భుతంగా కనిపించింది. రామాయణ సినిమాకి విఎఫ్ఎక్స్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సంస్థ డిఎన్ఈజీ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ డిజైన్ గా పనిచేస్తోంది.


ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు  రామాయణ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి గ్లింప్స్  అందరిని ఆకట్టుకుంటోంది. రెండవ భాగం 2027 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వర్షన్ డైలాగులు బాధ్యత ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్కు అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ తో పాటు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మోర్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మిగిలిన నటీనటుల పై మరిన్ని అప్డేట్స్ విడుదల చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: