‘పెద్ది’ కొత్త పోస్టర్ సునామీ.. రిలీజ్ డేట్‌పై కన్ఫ్యూజన్!
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది.ఇటీవల విడుదలైన ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్ ఆధారంగా రూపొందించిన ఈ పోస్టర్లో రామ్ చరణ్ లుక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఆయన కండలు తిరిగిన దేహం, నిలబడిన తీరు సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి రూపాన్ని తలపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో గ్రామీణ వాతావరణంలో సాగే ఈ కథ కోసం చరణ్ పడుతున్న శ్రమ ఆ పోస్టర్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ‘రగ్గడ్’ అండ్ ‘రా’ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసేసింది.
గత కొన్ని రోజులుగా ‘పెద్ది’ సినిమా వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలువినిపిస్తున్నాయి. అయితే, ఈ పుకార్లకు రామ్ చరణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.ఈ చిత్రం అనుకున్న సమయానికే, అంటే ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చరణ్ స్పష్టం చేశారు. అయితే, తాజా పోస్టర్లో రిలీజ్ డేట్ లేకపోవడంతో అభిమానులు కొంచెం డైలమాలో పడ్డారు.మేకర్స్ రిలీజ్ డేట్ విషయంలో పక్కా క్లారిటీ ఇవ్వకపోవడానికి కారణం.. ప్రమోషన్లలో భాగంగా ఒక భారీ వీడియో అప్డేట్తో డేట్‌ను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయాలనే ప్లాన్ అని టాక్.