బైకర్ మూవీ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే..?
భారతీయ మొదటి మోటోక్రాఫ్ రేసింగ్ చిత్రంగా సినిమా రిలీజ్ కి ముందే అందరిని ఆకర్షించింది. ఇందులో రేసర్గా శర్వానంద్ నటించిన ఆయనకు తండ్రిగా సీనియర్ హీరో రాజశేఖర్ నటించారు. ట్రైలర్, విజువల్స్ సాంకేతిక ప్రమాణాలు అన్నీ కూడా ఆకట్టుకున్నాయి.
స్టోరీ విషయానికి వస్తే:
సునీల్ నారాయణ్ అలియాస్ బుల్లెట్ సునీల్ (రాజశేఖర్) మాజీ మోటో క్రాస్ రేసర్ గా ఇండియాలో మోటోక్రాస్ రేసింగ్ కు గుర్తింపు తీసుకురావాలనే తపన ఉంటుంది. అందుకే మోటోక్రాస్ రేసర్లని తీర్చిదిద్దే పనిలో ఉంటారు. తన కుమారుడు విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ (శర్వానంద్) తండ్రి దగ్గరే మోటోక్రాస్ రేసర్గా శిక్షణ పొంది రాటుదేలుతాడు. తన తండ్రి కన్న కలని నిజం చేసేందుకు విక్కి అంతర్జాతీయ స్థాయిలో రేసింగ్లో పాల్గొంటారు. ఆ ట్రాక్ పైన జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా విక్కి మూడో స్థానంలో గెలుస్తారు. ఆ తర్వాత విక్కి అనూహ్యంగా రేసింగ్ కి దూరం కావాలని నిర్ణయించుకుంటారు. అదే తండ్రి, తనయుల మధ్య దూరాన్ని పెంచిన ఆ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి? విక్కీ జీవితంలోకి అనన్య (మాళవిక నాయర్) ఎవరు? కొన్నేళ్లపాటు తండ్రికి రేసింగ్ కి దూరంగా గడిపిన విక్కి మళ్ళీ ట్రాక్ పైకి రావాలని దారి తీసిన పరిస్థితులు ఏంటి? తండ్రి తనయులు మళ్లీ కలిసారా లేదా అనేది సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే:
సినిమాలో క్రీడా ప్రధానమైన అంశాలను చూపించారు. సినిమాలోని పాత్రలు సహజమైన సంఘర్షణ బాగోద్వేగాలపైన ప్రధాన దృష్టి పెట్టారు డైరెక్టర్. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో సరికొత్తగా చూపించారు. రేసింగ్ సీన్స్, విజువల్స్ అత్యున్నత ప్రమాణాలతో చాలా థ్రిల్లింగ్ గా చూపించారు. హీరో రేసింగ్ వదులుకోవడానికి దారి తీసిన పరిస్థితులు మళ్లీ రేసింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించుకోవడానికి తీసుకున్న సంఘటనలు ఈ సినిమాలో చాలా కీలకం.
ఎవరెవరు ఎలా నటించారంటే:
కథానాయకుడిగా శర్వానంద్ నటన ఈ సినిమాకి ప్రధాన బలం. అచ్చం ఒక స్పోర్ట్స్ మేన్ లాగే తన లుక్కుని మార్చుకొని తెరపైన అద్భుతంగా కనిపించారు. యాక్షన్ తోపాటు బాగోద్వేగమైన సన్నివేశాలలో అద్భుతంగా నటించారు. బుల్లెట్ సునీల్ పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నారు. కథానాయక మాళవిక నాయర్ సినిమాలో అద్భుతమైన పాత్రలో మెరిసింది. అతుల్, బ్రహ్మాజీ, కులకర్ణి తదితర నటి నటులు పాత్రలలో పరిధి మేరకే నటించారు. ఈ సినిమాలో విజువల్స్ కట్టిపడేసాయి. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మోటోక్రాస్ రేస్ ను అథెంటిక్ గా చూపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.
బలాలు:
శర్వానంద్ యాక్టింగ్
రేసింగ్ నేపథ్యం
విజువల్స్
మైనస్:
ఆకట్టుకొని కథ కదనం
కొరవడిన బాగోద్వేగాలు
రేటింగ్:
2.6/5