రష్మిక మందన్నా బిగ్ రాంగ్ స్టెప్..సోషల్ మీడియా మొత్తం గబ్బు లేపేస్తుంది..!

Thota Jaya Madhuri
రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో ఎంతో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. పెళ్లి తర్వాత ఈ జంటకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. “ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం” అనే క్యాప్షన్‌తో ఆమె ఒక యానిమేషన్ వీడియోను షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆమె ధరించిన టీషర్ట్‌పై గుడ్డు ఆకారంలో ఉన్న ఒక డిజైన్ కనిపించడం, అలాగే ఆమె వాడిన పదజాలం కారణంగా చాలామంది ఆమె గర్భవతి అని అనుకునేశారి. పెళ్లయిన కొద్ది రోజుల్లోనే ఈ జంట శుభవార్త చెప్పారంటూ నెటిజన్లు శుభాకాంక్షలతో కామెంట్స్ చేశారు.

అయితే, ఈ వార్తల్లో అసలు నిజం వేరే ఉంది. రష్మికకు ‘పొద్దుతిరుగుడు పువ్వు’ అంటే చాలా ఇష్టం. దాన్ని ఆమె తనకు అత్యంత సన్నిహితమైన ఫ్రెండ్‌లా భావిస్తూ ఉంటుంది.  ఆమె రూపొందించిన యానిమేటెడ్ ప్రపంచంలో ఈ పువ్వు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తాజాగా ఆ యానిమేషన్ కథలోకి విజయ్ దేవరకొండను కూడా పరిచయం చేస్తూ సరదాగా ఈ వీడియోను షేర్ చేసింది. “మేము ముగ్గురమయ్యాం” అన్నది కూడా ఆ యానిమేషన్ పాత్రలను ఉద్దేశించి చెప్పిందే తప్ప, గర్భధారణకు సంబంధించిన ఎలాంటి సంకేతం కాదు.

కానీ ఈ విషయాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి క్లారిటీ లేని పోస్టులు ఎందుకు పెడుతున్నారంటూ కొందరు రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల్లో అనవసరమైన సందేహాలు కలిగించేలా వ్యవహరించడాన్ని కొందరు “బిగ్ రాంగ్ స్టెప్”గా అభివర్ణిస్తున్నారు. మొత్తానికి, ఒక సరదా యానిమేషన్ పోస్టు అనవసరమైన అపోహలకు దారి తీసి పెద్ద చర్చగా మారింది. సోషల్ మీడియా ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో, చిన్న విషయం కూడా ఎలా పెద్ద వార్తగా మారుతుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: