లవ్ పై ఓపెన్ అయిన మృణాల్ ఠాకూర్..!

Divya
టాలీవుడ్, బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తన అందం అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం అడవి శేష్ తో కలసి డేకాయిట్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తన లవ్ పైన ఓపెన్ గానే మాట్లాడేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రేమలో అన్ని హద్దులు దాటే సమయం ఇంకా రాలేదని కానీ అది త్వరలో రావచ్చు అంటూ చెప్పడంతో అటు అభిమానులలో మరింత ఆసక్తి పెంచేసింది.



ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేమ కోసం ఎంతవరకు వెళ్లారనే ప్రశ్న ఎదురవ్వగా .. మృణాల్ ఠాకూర్ ప్రేమలో అన్ని హద్దులు దాటడం నా జీవితంలో ఇంకా జరగలేదు. అది రాబోతోంది ఆరోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ చెబుతానంటూ తెలియజేసింది. ఇక హీరో అడివి శేష్ తన గత ప్రేమ అనుభవాలను పంచుకుంటూ.. ఒకప్పుడు తన ప్రేమ కోసం జోబులో డబ్బులు లేక యూరప్ నుంచి కెనడా వరకు ప్రయాణించిన విషయాన్ని తెలియజేశారు. ఆ సమయంలో అనుభవించిన కష్టాలు కొత్త పరిచయాలు తన జీవితంలో చాలా ప్రత్యేకంగా నిలిచాయి అంటూ వెల్లడించారు.


మృణాల్ ఠాకూర్ గతంలో ప్రేమ గురించి మాట్లాడుతూ తొలిచూపు ప్రేమనే తాను నమ్ముతానని అయితే ఆడవాళ్లు బయట బలంగా కనిపించిన లోపల మాత్రం చాలా బాగోద్వేగాలను మరిచిపోలేరంటూ తెలిపింది. గత కొద్దిరోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ప్రేమలో ఉందనే విధంగా వార్తలు వినిపించాయి. ఈ వార్తలను ఆమె ఖండించినప్పటికీ ఈ రూమర్స్ మరింత వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా తన లవ్ లైఫ్ పైన చేసిన కామెంట్స్ అభిమానులలో మరో కొత్త చర్చకు దారి తీసేలా కనిపిస్తోంది. మరి మృణాల్ హద్దులు దాటే ప్రేమ గురించి ఎప్పుడు చెబుతుంది? ఆ ప్రేమికుడు ఎవరో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: