స్మోకింగ్ హ్యాబిట్ పై సెల్వరాఘవన్ సంచలన వ్యాఖ్యలు..!

Divya
తమిళ డైరెక్టర్గా ,నటుడుగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్లలో సెల్వరాఘవన్ కూడా ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈయన సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆడవారి మాటలకు అర్ధాలేవేరులే, యుగానికి ఒక్కడు ,7/G బృందావన కాలనీ వంటి చిత్రాలతో తెలుగులో కూడా బాగా పేరు సంపాదించారు.అందుకే టాలీవుడ్ లో కూడా సెల్వరాఘవన్ కు ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పవచ్చు. అయితే సెల్వరాఘవన్ కు స్మోకింగ్ చేసే అలవాటు ఉందట. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన స్మోకింగ్ అలవాటు గురించి ఓపెన్ గానే మాట్లాడారు.


యాంకర్ స్మోకింగ్ పైన ప్రశ్నించగా.. తాను మార్చుకోవాలను కొనే ఒకే ఒక అలవాటు స్మోకింగ్ అంటూ ఓపెన్ గానే చెప్పేశారు. స్మోకింగ్ హ్యాబిట్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని దానిని మానడానికి తాను ఎన్నో సార్లు ప్రయత్నించాను, కానీ అది ఇప్పటివరకు జరగలేదు. ఒకవేళ అవకాశం వస్తే కచ్చితంగా సిగరెట్ స్మోకింగ్ మానేస్తానంటూ తెలియజేశారు. ఎవరైనా నా మాట వింటే నేను ఒకే విషయాన్ని చెబుతాను ఏం చెప్పినా పర్లేదు కానీ ఎప్పుడు స్మోకింగ్ జోలికి మాత్రం వెళ్ళవద్దని చెబుతానంటూ తెలిపారు.


నటుడుగా డైరెక్టర్ గా తన వ్యక్తిగత విషయాల గురించి ఇలా ఓపెన్ గా మాట్లాడడంతో చాలామంది నెటిజన్స్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ను ప్రశంసలు కురిపిస్తున్నారు. సెల్వరాఘవన్ తండ్రి కస్తూరి రాజా కూడా డైరెక్టర్ గా పేరు సంపాదించారు. సెల్వరాఘవన్ సోదరుడు ధనుష్ కూడా హీరోగా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రముఖ హీరోయిన్ సోనియా అగర్వాల్ 2006లో ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత 2009లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత 2011లో గీతాంజలి ని వివాహం చేసుకున్నారు. ఈమె కూడా సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఒక సినిమాకి సహాయ దర్శకురాలిగా పనిచేసింది. సెల్వ రాఘవన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: