జైలర్ 2 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రజనీకాంత్..!
సన్ పిక్చర్ బ్యానర్ పైన నిర్మిస్తున్న జైలర్ 2 ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 చిత్రం పైన ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణాంతర పనులు చివరిదశలో ఉన్నాయంటూ తెలియజేశారు. ఈ సీక్వెల్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలు చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటులు మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ కూడా స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారు.
ఎస్ జె.సూర్య విలన్ గా నటిస్తూ ఉండగా, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇందులో గెస్ట్ పాత్రలో పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇన్ని ప్రత్యేకతలు మధ్య వస్తున్న జైలర్ 2 సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి మరి. జైలర్ 2 చిత్రానికి మ్యూజిక్ అందిస్తోంది అనిరుద్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన చిన్నపాటి గ్లింప్స్ అభిమానుల అంచనాలను పెంచేసింది. మరి ట్రైలర్ తో ఎలాంటి రికార్డులను తిరగా రాస్తారో చూడాలి మరి. మొత్తానికి జైలర్ 2 సినిమా పైన అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.