అశ్లీల వెబ్‌సైట్‌లో ఫోటో చూసి షాక్ అయ్యా.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్..!

Divya
టాలీవుడ్ బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది హీరోయిన్ జాన్వీ కపూర్. అలనాటి దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురే జాన్వీ కపూర్. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన టినేజ్ రోజులలో ఎదురైన ఒక భయంకరమైన సంఘటనని తెలియజేసింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన స్కూలులో చదువుకుంటున్న సమయంలో ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోను డీప్ ఫేక్ సాంకేతికతతో మార్చి అస్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేశారని తెలియజేసింది.


ఆ సమయంలో తన స్నేహితురాలు ఈ విషయాన్ని చెప్పే వరకు తనకు తెలియదని తీరా ఆ ఫోటో చూసి నేనే షాక్ అయ్యాను. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక చాలా బాధపడ్డాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో కనీస నైతికత ఉండదని తనకు అర్థమయిందని భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని అప్పుడే మానసికంగా సిద్ధమయ్యానంటూ తెలిపింది జాన్వీ కపూర్. ఇప్పుడు తనపై వస్తున్న డీప్ ఫేక్ ఫోటోలు లేదా ఇతర నేటివ్ కామెంట్స్ లను తాను పెద్దగా పట్టించుకోలేదంటూ క్లారిటీ ఇచ్చింది.


ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సెలబ్రెటీలు ఇలాంటి సమస్యలను చాలా ఎదుర్కోవాల్సి వస్తుందని వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోవడమే అసలైన సవాల్ అంటూ తెలిపింది. జాన్వీ  కపూర్ చేసిన ఈ కామెంట్స్ కి నెటిజెన్స్  సైతం అభినందిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకోవడం వల్ల తోటి యువతకు , మహిళలు  ధైర్యంగా ఇలాంటివి జరిగితే ఎదుర్కోవాలని సలహా ఇస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమాలో నటిస్తోంది. అలాగే దేవర 2 చిత్రంలో కూడా నటించబోతోంది. ఒకవైపు బాలీవుడ్ లో నటిస్తూనే మరొకవైపు టాలీవుడ్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: