పోస్టర్‌తోనే హంగామా.. రేపు టైటిల్‌తో రికార్డులేనా?
ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తుండటం సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన అట్లీ, ఇప్పుడు బన్నీతో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారా అని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది.అత్యంత భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఒక ‘హై-వోల్టేజ్’ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది. ఈ చిత్రంలో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ మరియు అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని సమాచారం. బన్నీ స్టైలిష్ మేకోవర్ ఈ సినిమాకు మెయిన్ అసెట్ కానుంది.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్ మరియు గ్లింప్స్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఖరారైంది.రేపు (ఏప్రిల్ 8) ఉదయం 11 గంటలకు ఈ సినిమా పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు. అప్పటివరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న మేకర్స్, పోస్టర్‌తోనే ‘హైప్’ క్రియేట్ చేశారు.కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో విశేషం. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ బన్నీకి ఎలాంటి మాస్ బీట్స్ ఇస్తారో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ‘కడల్’ ఫేమ్ సాయి అభ్యంకర్ ఈ ప్రాజెక్ట్ లో భాగమవ్వడం సినిమాకు ఒక కొత్త సౌండ్ ఇస్తుందని టాక్.