అజ్ఞాతవాసం వెనుక ట్విస్ట్.. అనిల్ రావిపూడి కొత్త స్ట్రాటజీ!
ఈ ఈవెంట్ ముగిసిన వెంటనే అనిల్ రావిపూడి ముంబైకి ప్రయాణమవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది.సాధారణంగా దర్శకులు కథా చర్చల కోసం విదేశాలకు వెళ్తుంటారు. కానీ, ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా విదేశీ ప్రయాణాలు రిస్క్‌తో కూడుకున్నవిగా మారాయి. అందుకే అనిల్ తన స్క్రిప్ట్ వర్క్ కోసం భారత్‌లోని సురక్షితమైన, ప్రశాంతమైన ముంబై లేదా అరకు, ఊటీ వంటి హిల్ స్టేషన్లను ఎంచుకున్నట్లు సమాచారం.అనిల్ ముంబై వెళ్లడం వెనుక కేవలం కథా రచన మాత్రమే ఉందా.. లేక బాలీవుడ్ స్టార్లతో ఏవైనా చర్చలు జరపడానికి వెళ్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. ‘టార్గెట్ X’ పేరుతో సిద్ధం చేస్తున్న ఈ కథ ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ కావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి దిగ్గజ హీరోలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఘనత అనిల్ సొంతం.కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా, తన సినిమాకు జాతీయ అవార్డును కూడా అందుకుని అనిల్ తన సత్తా చాటారు. గత చిత్రాల్లో యాక్షన్-ఎమోషనల్ డ్రామాను టచ్ చేసిన అనిల్, ఈసారి మళ్ళీ తన మార్కు ‘ఎఫ్ 2’ తరహా కామెడీతో వస్తారా లేదా సరికొత్త పాన్ ఇండియా యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారా అనేది సస్పెన్స్‌గా మారింది. కొన్ని నెలల పాటు ఆయన కెమెరా కంటికి దూరంగా ఉన్నా, కలం మాత్రం పదునైన కథను సిద్ధం చేస్తోంది.కొన్ని నెలల అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.