బన్నీ పుట్టిన రోజుకి మరో స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్ కలలో కూడా ఊహించనిది ఇది..!

Thota Jaya Madhuri
బన్నీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మరో ప్రత్యేకమైన సర్ప్రైజ్ సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఎవరూ ఊహించని రీతిలో ఈ ట్రీట్ ఉండబోతుందనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ నుంచి అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో 26వ సినిమాగా చేయబోయే ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఈ చిత్రం పూర్తిగా “వారణాసి” లేదా “రామాయణం” తరహాలో గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేయకపోయినా, దాని కంటెంట్ మాత్రం ఆ స్థాయిలోనే ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బన్నీ పుట్టినరోజు కానుకగా దర్శకుడు అట్లీ ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రీట్‌ను సిద్ధం చేశాడని సమాచారం. ఇటీవల విడుదలైన పోస్టర్‌లో ఒక బీస్ట్ చేతిని రివీల్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది.అయితే, ఈ కాన్సెప్ట్ గురించి మేకర్స్ ముందుగానే చిన్న హింట్ ఇచ్చిన విషయం గుర్తించాల్సిందే. సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలోనే అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన సెటప్ చేతిని తన చేతికి తొడుక్కుని కనిపించడం గమనించాం. అప్పుడే ఈ సినిమాలో ఏదో విభిన్నమైన అంశం ఉండబోతుందని అర్థమైంది.

ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. బన్నీ బర్త్‌డే సందర్భంగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక వివరాలు కూడా ప్రకటించే అవకాశం ఉందట. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో ఒక సినిమా అనౌన్స్‌మెంట్ రావొచ్చని టాక్ వినిపిస్తోంది. అదే విధంగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కే మరో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పోస్టర్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మొత్తానికి, ఈసారి అల్లు అర్జున్ పుట్టినరోజు అభిమానులకు ఒక పండుగలా మారబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. వరుసగా వస్తున్న ఈ అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ పీక్‌కు చేరుకుంది. ఇక అధికారిక ప్రకటనలు రావడమే ఆలస్యం, ఈ సర్ప్రైజ్‌లు ఇండస్ట్రీని ఎలా షేక్ చేస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: