అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ వచ్చేసింది.. టైటిల్ ఏమిటంటే..?
ముఖ్యంగా పోస్టర్లో అల్లు అర్జున్ లుక్ కూడా గుండుతో పాటు జంతు శరీరంతో పెద్ద పెద్ద గోర్లు చేతులకు కనిపిస్తూ ఉన్న పోస్టర్ ను సైతం చూడవచ్చు. ఈ సినిమా 2027 లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అట్లీ. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ను కూడా మొదలుపెట్టారు. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉండగా మరి కొంతమంది హీరోయిన్స్ ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయిలో నిపుణులు ఈ సినిమాకి పనిచేస్తున్నట్లు తెలిసిందే.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు.
ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి మరికొన్ని విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అల్లు అర్జున్ సినిమాలో విషయానికి వస్తే ఇప్పటికే పుష్ప 2 చిత్రంతో రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించారు. డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఒక సినిమా, లోకేష్ కనకరాజుతో మరొక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్ప 3 సినిమా పైన ఏదైనా అప్డేట్ సుకుమార్ అందిస్తారేమో అంటే అభిమానులు చాలా ఆశగా ఎదురు చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ అల్లు అర్జున్ కొత్త సినిమాకు సంబంధించి టైటిల్ మాత్రం వైరల్ గా మారింది.