ఆయనవల్లే నా జీవితం మారింది.. జబర్దస్త్ ఫైమా కామెంట్స్..!

Divya
తెలుగు బుల్లితెరపై పటాస్ షో ద్వారా మొదటిసారి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది ఫైమా. తన కామెడీతో అందరినీ ఆకట్టుకున్న తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వడంతో ఈమె కామెడీ స్కిట్ల వల్ల భారీ పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్ తో కలిసి చేసే స్కిట్స్ ఆడియన్స్ కి బాగా నచ్చాయి. దీంతో తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొనింది. విజేతగా నిలుస్తుందనుకున్న ఫైమా తన ఆట మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నప్పటికీ విన్నర్ కాలేక పోయింది.


నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఫైమా జబర్దస్త్ తో పాటుగా పలు టీవీ ప్రోగ్రామ్స్లలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక టాక్ షోలో పాల్గొన్న ఫైమా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. తాను హైదరాబాద్ కి వచ్చినప్పుడు తనకు ఇక్కడ ఎవరూ లేరని హాస్టల్లో ఉన్నప్పుడు కొత్త కొత్త వాళ్లు కూడా పరిచయమయ్యారు. అయితే అవకాశాలు పెద్దగా రాలేదు. ఆ సమయంలోనే పటాస్ షోకి వెళ్లాను తొలి రెండేళ్లు తనకు పెద్దగా అవకాశాలు రాలేదు. పేమెంట్ కూడా పెద్దగా ఇవ్వలేదని, కానీ బుల్లెట్ భాస్కర్ అన్న స్కిట్లో తనని చేర్చుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి నా జీవితమే మారిపోయిందంటూ తెలిపింది.


అవకాశాలు పెరిగాయి తన పాపులారిటీ పెరిగింది పేమెంట్స్ కూడా పెరిగాయి నిజం చెప్పాలి అంటే బుల్లెట్ భాస్కర్ అన్న వల్లే తాను ఇంత ఫేమస్ అయ్యాను ఆయన లేకపోతే తాను ఇంత ఫేమస్ కాలేనని తెలిపింది. అంతేకాకుండా ఆయన నన్ను బయట ఈవెంట్స్ కి కూడా తీసుకువెళ్లడం మరింత ప్లస్ అయ్యింది అంటూ ఎమోషనల్ గా తెలిపింది. సినిమా అవకాశాలు కూడా చాలానే వచ్చాయి కానీ సినిమా అంటే ఎలా చేయాలో అర్థం కావడం లేదు.. ఒక సినిమాలో లేడీ కామెడియన్ క్యారెక్టర్ అని చెప్పి షూటింగ్ కి తీసుకువెళ్లాగా అక్కడికి వెళ్తే తనకు డైలాగులే లేవు మొత్తం పది రోజులు షూట్ చేశారు. దాంతో అప్పటినుంచి నాకు సినిమాల పైన ఇంట్రెస్ట్ పోయిందంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: