వంటింటి చిట్కాలతో బొద్దింకలు దెబ్బకి పరార్..!
ప్రతి ఇంట్లో ఉల్లి ,వంటసోడా ఉంటాయి. ఉల్లి ముక్కలను బేకింగ్ సోడాలో కలిపి బొద్దింకలు ఉన్నచోట వాటిని వేస్తే..బేకింగ్ సోడా వాటిని అంతం చేస్తాయి.
రెండు స్పూన్ల బేకింగ్ సోడాను కలుపుకొని అందులో కొంచెం పంచదార వేయడం వల్ల కీటకాలు ఆకర్షిస్తాయి. వీటిని మిశ్రమంగా చిన్నచిన్న ఉంటలుగా చేసి సింక్, డస్ట్ బిన్ ఆహారం పడేచోట ఉంచితే చాలు సరైన ఫలితం లభిస్తుంది.
అలాగే మరొక పద్ధతి హెయిర్ స్ప్రే ని ఉపయోగించడం వల్ల బొద్దింకలను తరిమి కొట్టవచ్చు. బొద్దింక కనపడగానే దానిమీద హెయిర్ స్ప్రేయింగ్ చేయడం వల్ల వాటి కాళ్లు, చేతులు కదలకుండా ఉంటాయి. ఆ తర్వాత నెమ్మదిగా అవి మరణిస్తాయి.
బొద్దింకల నుండి బయట పడాలి అంటే బిర్యానీ ఆకుల ను ఉపయోగించుకోవచ్చు. ఘాటైన వాసన వల్ల బొద్దింకలకు నచ్చవు కాబట్టి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో వీటిని పెట్టడం వల్ల అక్కడ బొద్దింకలు గూడు కట్టినా సరే బిర్యాని ఆకులను ఉంచితే చాలు ఆ వాసన వల్ల వెంటనే పారిపోతాయి.
అప్పుడప్పుడు అమ్మోనియాతో ఇంటి లోపల శుభ్రం చేయడం వల్ల కూడా బొద్దింకలు ఉండవు. అమ్మోనియా వాసన బొద్దింకలకు విరుద్ధంగా వస్తుంది కాబట్టి దరి చేరవు. ఒక బకెట్ నీళ్లలోకి కొంత అమూల్య వేసి ఇంటిని శుభ్రం చేయడం వల్ల బొద్దింకలు ఇంటిలోకి రాలేవు.