ఒకే వేదికపై టాలీవుడ్ దిగ్గజాలు.. నెట్టింట ఫోటో హల్‌చల్!
ఒకే వేదికపై ‘మెగా-కింగ్’..ఆత్మీయ పలకరింపులు:
హైదరాబాద్‌లో జరిగిన మహేష్ రెడ్డి ఆత్మీయ విందులో టాలీవుడ్ అగ్ర తారలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా భారీగా తరలివచ్చారు.చిరంజీవి, నాగార్జున ఒకే సోఫాలో కూర్చుని కాసేపు మనసు విప్పి మాట్లాడుకోవడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఈ ఇద్దరు స్టార్స్ నవ్వుతూ కనిపించడం ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటిదే. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణరాజు (RRR) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాగార్జున ఎంతో ఉత్సాహంగా రఘురామ కృష్ణరాజుతో కరచాలనం చేస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. పక్కనే ఉన్న మెగాస్టార్ చిరంజీవి వారి సంభాషణను ఆస్వాదిస్తూ చిరునవ్వులు చిందించడం ఆ ఫోటోకే హైలైట్.
‘విశ్వంభర’.. బాబీ కొల్లితో ‘మెగా 158’ రాంపేజ్!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు.ఈ సినిమా పూర్తయిన వెంటనే మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి తన 158వ సినిమాను ప్రారంభించబోతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ కాంబో మళ్ళీ సెట్స్ మీదకు వెళ్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పట్టాలెక్కనుంది.విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’తో చిరు మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కింగ్ గర్జన.. 100వ సినిమాకు రంగం సిద్ధం!
మరోవైపు కింగ్ నాగార్జున కూడా ‘నెక్స్ట్ లెవల్’ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘కుబేర’ షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ్, ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న ‘కూలీ’ (Coolie)లో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో నాగ్ క్రేజ్ మళ్ళీ పాన్ ఇండియా లెవల్‌కు చేరింది.తన ప్రతిష్టాత్మక 100వ సినిమా కోసం నాగార్జున కసరత్తులు చేస్తున్నారు. ఈ మైల్ స్టోన్ మూవీని ఒక సెన్సేషనల్ డైరెక్టర్‌తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి టైట్ షెడ్యూల్స్ మధ్య కూడా చిరుతో కలిసి విందులో పాల్గొనడం నాగ్ స్నేహశీలిత్వానికి నిదర్శనం.చాలా కాలం తర్వాత చిరు, నాగ్ ఇలా ఒకే వేదికపై సరదాగా ముచ్చటించుకుంటూ కనిపించడంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ ఫోటో హాట్ టాపిక్‌గా మారింది.