మద్యానికి బానిసైన స్టార్ హీరో.. ఎవరంటే..?

Divya
ఇండస్ట్రీలో చాలా మంది ఏదో ఒక సమయంలో లేదా డిప్రెషన్ లో ఉన్న సమయంలో కొంతమంది సెలబ్రిటీలు ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా చాలానే చూశాము. మరి కొంతమంది మానసిక ఒత్తిడి వల్ల ఈ లోకాన్ని విడిచిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మరి కొంతమంది మాత్రం మద్యానికి , సిగరెట్లకు బానిస అయినట్టుగా కూడా తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఒక స్టార్ హీరో మద్యానికి బానిస అయ్యానని ఆ సంఘటన తనకి ఇప్పటికీ కలిచివేసేలా ఉంటుందంటూ తెలియజేశారు.


ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన అమీర్ ఖాన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అమీర్ ఖాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఒకానొక సమయంలో తాను ఎంతో మనోవేదనకు గురయ్యారని ఆ సమయంలో తాను మద్యానికి బానిస అయ్యానని, తన మొదటి భార్య రీనా ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు చాలా బాధపడ్డాను ఎంతో భరించలేని మనోవేదనకు గురయ్యానంటూ తెలిపారు.


తన భార్య ఇంటి నుండి వెళ్లిపోయినప్పుడు నా గుండె ముక్కలు అయింది. ఆ బాధను ఎలా ఎదుర్కోవాలో తెలియకనే తాను మద్యానికి బానిసయ్యానని, రోజుల తరబడి గంటల తరబడి మద్యం తాగేవాడినంటూ తెలిపారు. తన పిల్లల భవిష్యత్తు ఆలోచించిన తర్వాత తన పిల్లల భవిష్యత్తు కోసం తాను నిలబడాలని ఆ క్షణమే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను ఆ క్షణం నుంచి మద్యం మానేశానని తెలిపారు.. అమీర్ ఖాన్, రీనా దత్త వివాహం 1986 లో జరగగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 2002లో వీరిద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా అమీర్ ఖాన్  మరోసారి ప్రేమలో పడినట్లు తన ప్రేయసిని పరిచయం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: