మోనాలిసా భర్త పై పోక్సో కేస్..!

Divya
మహా కుంభమేళలో పూసలు అమ్ముతు ఒక్కసారిగా సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సంపాదించుకుంది కుంభమేళ మోనాలిసా బోస్లే. ఆ తర్వాత ఎక్కడ చూసినా ఈమె పేరే వైరల్ గా మారింది. దీంతో బాలీవుడ్ డైరెక్టర్ ఆమెతో సినిమా తీస్తానంటూ ప్రకటించడంతో మరింత క్రేజీ సంపాదించింది. అలా సినిమా అవకాశాలు రావడంతో మరింత క్రేజ్ అందుకున్న ఇమే తెలుగులో కూడా పలు సినిమాలలో అవకాశాలు లభించాయి. ఇటువంటి సందర్భంలోనే ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమిస్తూ ఈ ఏడాది మార్చి 11న కేరళలోని ఒక ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వివాహం అనంతరం మోనాలిసా పెళ్లి పైన పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.


ముఖ్యంగా మోనాలిసా మైనర్ అని ఆమెకు 16 సంవత్సరాలే అంటూ ఫిర్యాదులు కూడా వెళ్ళబడ్డాయి. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఆమె పెళ్లిని అంగీకరించలేదు. ఈ ఫిర్యాదు పైన జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ విచారణ జరిపించింది. అయితే ఆధారాలను పరిశీలించిన అనంతరం వివాహం నాటికి మోనాలిసాకు 16 సంవత్సరాల 2 నెలల 12 రోజులు మాత్రమే ఉందంటూ నిర్ధారించింది. మైనర్ అయినప్పటికీ ఆమెను ప్రలోభ పెట్టి వివాహం చేసుకున్నారనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్ ఖాన్ పైన పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.



కుటుంబ సభ్యులను ఎదిరించి మరి ఈ వివాహం చేసుకున్నప్పటికీ చట్టపరమైన చిక్కులతో ఇప్పుడు ఈ జంట చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు సోషల్ మీడియాలో స్టార్ గా పేరు సంపాదించిన మోనాలిసా జీవితం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మెట్లు ఎక్కే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఈ పెళ్లి లవ్ జిహాద్ వల్ల జరిగిందనే విధంగా వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన మోనాలిసా కూడా క్లారిటీ ఇచ్చినప్పటికీ పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు తన భర్త ఫార్మన్ ఖాన్ పైన వస్తున్న ఈ కేసు పైన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: