సింగర్ మంగ్లీ పైన కేసు.. ఎందుకు ?ఏం జరిగిందంటే..?

Divya
రెండు తెలుగు రాష్ట్రాలలో ఫోక్ సింగర్ గా పేరు సంపాదించిన సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి క్రేజ్ తోనే పలు సినిమాలలో కూడా పాటలు పాడే అవకాశం సొంతం చేసుకుంది. ఇక సింగర్ మంగ్లీ పైన తాజాగా కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. మంగ్లీ పైనే కాకుండా ఆమె సోదరుడు శివ పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు అయినట్లుగా సమాచారం. సింగర్ మంగ్లీ తనని మోసం చేసిందని ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఒక న్యాయవాది ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు.


పోలీసులు మంగ్లీ ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురు పైన బిఎన్ఎస్ సెక్షన్ 351(2),352 కింద కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం సింగర్ మంగ్లీ ఆమె సోదరుడు శివ మరి కొంతమంది కలిపి సుమారుగా 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేశారని వ్యాపారంలో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి ఈ డబ్బులు తీసుకున్నట్లుగా ఆరోపించారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ లాభాలు ఇవ్వకపోగా అసలు కట్టిన డబ్బులను తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆరోపణలు చేశారు.


ఈ విషయం పైన గట్టిగా అడగగా సింగర్ మంగ్లీ ఆమె సోదరుడు శివ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనని యాక్సిడెంట్ చేసి చంపుతాను అంటూ మంగ్లీ ఆమె సోదరుడు బెదిరిస్తున్నట్లు పోలీసులకు తెలియజేశారు. దీంతో తనకు ప్రాణహాని ఉందని తెలిసి పోలీసులను ఆశ్రయించారు లాయర్ సుబ్బారావు. ఈ కేసులో A- 5 గా సింగర్ మంగ్లీ ఉండగా మిగిలిన నిందితుల పైన కూడా పలు రకాల కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. మరి ఈ విషయం పైన సింగర్ మంగ్లీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: