కాంతార చాప్టర్ 3 లేనట్టేనా..?

Divya
కన్నడ సినిమా ఇండస్ట్రీలో 2022 లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం కాంతార. ఈ సినిమాని కేవలం రూ .15 కోట్ల రూపాయలు బడ్జెట్ తో హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించగా పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత కాంతార చాప్టర్ 1 అంటూ 2025 లో విడుదల చేయగా అది కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా మూడో భాగం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


వారికి ఒక చేదు వార్త వినిపిస్తోంది. అదేమిటంటే రిషబ్ శెట్టి ఆ మాయ ప్రపంచానికి ఇక గుడ్ బై చెప్పబోతున్నట్లు పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ముఖ్య కారణం రిషబ్ శెట్టి, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మధ్య  తలెత్తిన కొన్ని వివాదాలే ఇందుకు కారణమని కన్నడ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. రిషబ్ తన తదుపరి ప్రాజెక్టులలో తన భార్య ప్రగతి ని సహా నిర్మాతగా చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారట. అలా తన ఫ్యామిలీని బిజినెస్ లోకి తీసుకురావాలని ఆలోచనతోనే హోంబలే ఫిల్మ్స్ ను అడగగా ఒప్పుకోలేదని తెలుస్తోంది.


గతంలో వీరి మధ్య కూడా కొన్ని ఆర్థిక పరమైన విభేదాలు కూడా వచ్చాయని వార్తలు వినిపించాయి. అందుకే కాంతార తదుపరి భాగం ప్రస్తుతం హొల్డ్ లో ఉంచినట్లుగా వినిపిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రిషబ్ శెట్టి దైవాన్ని కూడా చాలా గట్టిగానే నమ్ముతారు. ఇటీవల కాంతార హరేక్కనేమోత్సవంలో  పాల్గొన్న ఈ నటుడు తదుపరి భాగం తీయాల వద్ద అని దైవాన్ని ప్రార్థించగా సానుకూలంగానే సంకేతం లభించిందని వినిపిస్తోంది. కానీ హోంబలే ఫిలిమ్స్ వల్ల చాప్టర్ 3 పట్టాలెక్కకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులు  జై హనుమాన్, చత్రపతి శివాజీ వంటి వాటిలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: