వివాదంలో చిక్కుకున్న విష్ణు ప్రియ..ఏఐఎస్ఎఫ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు..!

Divya
తెలుగు బుల్లితెర యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ విష్ణు ప్రియ. పోవే పోరా అనే షోతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ రియాల్టీ షోలోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజీ సంపాదించుకున్న విష్ణు ప్రియ పలు రకాల రియాలిటీ షోలలోనే కాకుండా, ప్రైవేట్ ఆల్బమ్ సాంగులలో కూడా కనిపిస్తోంది. అయితే నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న విష్ణు ప్రియ ఇప్పుడు తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది.



అదేమిటంటే ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే ఫొటోస్ చాలా అసభ్యకరంగా ఉన్నాయని పైగా తన ఫొటోస్ అర్థనగ్న  వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ పేరుతో డబ్బులు చెల్లించాలి అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్ తాజాగా విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆమె పైన క్రిమినల్ కేసు నమోదు చేసి అనంతరం ఆమె ఇన్స్టా ఐడిని బ్లాక్ చేయాలని ఫిర్యాదుల పేర్కొన్నారు. అయితే శనివారం రోజున ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ తో పాటుగా మరికొంతమంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.



బుల్లితెరపై పలు షోలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న  విష్ణు ప్రియ ఇలాంటి కంటెంట్ ప్రోత్సహించడం పైన యువత పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని సమాజంలో ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తులే డబ్బుల కోసం ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటని ఏఐఎస్ఎఫ్ నాయకులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ వల్ల సమాజంలో నైతిక విలువలు కూడా దెబ్బతింటాయని అందుకే విష్ణు ప్రియ వంటి వారి ఇన్స్టా ఖాతాను తక్షణమే నిలిపివేసి ఆమె పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. మరి ఈ విషయం పైన యాంకర్ విష్ణు ప్రియ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. విష్ణు ప్రియనే కాకుండా చాలామంది ఇలాంటి పెయిడ్ సబ్స్క్రైబ్ పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు  వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: