‘దేవర’ నిర్మాతతో విశ్వక్.. ఈసారి హిట్ ఫిక్స్ అంటున్న ఫ్యాన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో 'దేవ్' వంటి స్టైలిష్ చిత్రాన్ని తెరకెక్కించిన రజత్ రవిశంకర్, ఆ సినిమా తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల పాటు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ ఏడేళ్లలో ఒక పక్కా కమర్షియల్ అండ్ న్యూ ఏజ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్న రజత్, ఇప్పుడు విశ్వక్ సేన్‌ను డైరెక్ట్ చేసేందుకు రంగంలోకి దిగాడు. దేవ్ నిరాశపరిచినప్పటికీ, ఈసారి విశ్వక్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్ ఉన్న రొమాంటిక్ కామెడీని ప్లాన్ చేశాడట.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్స్ పై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' వంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్న ఈ సంస్థ నుంచి సినిమా వస్తుందంటేనే అంచనాలు మరో స్థాయిలో ఉంటాయి. విశ్వక్ కెరీర్లో ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలవాలని మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు.
ఇటీవల జరిగిన ఈ సినిమా ఓపెనింగ్ వేడుకకు టాలీవుడ్ దిగ్గజాలు హాజరయ్యారు. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ ఫస్ట్ షాట్‌కు క్లాప్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ వేడుకను చూస్తుంటేనే అర్థమవుతోంది.. ఈ సినిమా వెనుక ఎంతటి బలమైన టీమ్ ఉందో!విశ్వక్ సేన్ అంటేనే ఒక ఎనర్జీ. ఈ సినిమా ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కబోతున్నప్పటికీ, మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే అంశాలు పుష్కలంగా ఉంటాయని టాక్. కేవలం యూత్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేసేలా రజత్ ఈ కథను మలిచారట. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో విశ్వక్ స్వయంగా శ్రద్ధ తీసుకుంటుండటంతో, ఈసారి 'మాస్ కా దాస్' రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయం!