విజయ్ పొలిటికల్ పై.. పవన్ కళ్యాణ్ కామెంట్స్..!

Divya
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం టీవీకే పార్టీ స్థాపించి త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. అందుకోసం ఇప్పటికే ప్రచార కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాలలో ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నారు. యాక్టింగ్ కి కూడా పూర్తిగా గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల మీడియాతో చిట్ చాట్ లో భాగంగా ఈ ప్రశ్న ఎదురవ్వగా పలు విషయాలు తెలిపారు.



ఎవరికైనా సలహా ఇవ్వడానికి తాను అంతగా విశ్వసించనని తెలియజేశారు. ప్రతి వ్యక్తి తన సొంత నిర్ణయంతోనే తన సొంత మార్గంతోనే రహదారులను ఏర్పరచుకుంటారని, అంతేకాకుండా విజయ్ కి ఉన్న స్టార్ డం ,రాజకీయ ఎంట్రీ పైన పాజిటివ్ గానే స్పందించారు. విజయ్ కి ఎలాంటి సలహా అవసరం లేదని, ప్రభావంతమైన వ్యక్తులు తాము పోషించే పాత్రతతో సంబంధం లేకుండా ప్రజల సేవ చేయడానికి ముందుకు రావడం ఎల్లప్పుడూ ప్రశంసించే విషయమని తెలియజేశారు.


దీంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చాలా బ్యాలెన్స్గా చేస్తూ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాకుండా ప్రజాసేవలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని కూడా తన మాటలలో చూపించారు పవన్ కళ్యాణ్. విజయ్ చివరిగా నటిస్తున్న చిత్రం జననాయగన్ ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది. అంతేకాకుండా ఇటీవల ఈ సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ లీక్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి. దీనిపై చిత్ర బృందం కేస్ ఫైల్ చేసింది. ఈ విషయంపై చాలామంది సెలబ్రిటీలు కూడా విజయ్ కు మద్దతుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తూనే మరొకపక్క సినిమాల విషయంలో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: