క్రేజ్ అంటే ఇది రా మావ.. రిలీజ్ కి ముందే సెన్సేషన్ రికార్డ్ కొట్టేసిన అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ..!?
ఇంకా షూటింగ్ మొదలుకాకముందే ఈ చిత్రం డిజిటల్ మార్కెట్లో రికార్డ్ స్థాయి క్రేజ్‌ను సృష్టించడం విశేషం. అనిల్ రావిపూడి గత చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వర ప్రసాద్ గారు లాగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి కూడా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 భారీ ధరకు డిజిటల్ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ దర్శకుడి సినిమాలకు ఓటీటీలో మంచి వ్యూస్, హై రేటింగ్స్ రావడం వల్ల ఈ డీల్ రికార్డు స్థాయిలో జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు విశాఖపట్నంలో వేగంగా కొనసాగుతున్నాయి. తన ప్రతి సినిమాకు అక్కడే స్క్రిప్ట్ ఫైనల్ చేసే సెంటిమెంట్ ఉన్న అనిల్ రావిపూడి, ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ హాఫ్‌ను లాక్ చేసినట్లు సమాచారం. కథలో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్లలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట.
త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా సెట్స్‌పైకి తీసుకెళ్లి, షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి, 2027 సంక్రాంతి సీజన్లో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాలని అనిల్ రావిపూడి భారీ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటినుంచే ఇంత హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ టైమ్‌కి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.