మెగా హీరోకి సర్జరీ.. అసలేం జరిగిందంటే..?
వైద్యులు పరీక్షించి అనంతరం వరుణ్ తేజ్ కు చిన్నపాటి సర్జరీ అవసరమని సూచించారట. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో సర్జరీ కూడా విజయవంతంగా పూర్తి అయ్యిందని చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది. ఈ సర్జరీ వల్ల వరుణ్ తేజ్ కనీసం కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీనివల్ల బరి సినిమా షెడ్యూల్ కొంత మేరకు మార్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వరుణ్ తేజ్ పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి సినిమా షూటింగ్ మొదలు పెట్టాలా ప్లాన్ చేశారు.
వరుణ్ తేజ్ తన పాత్ర కోసం శారీరకంగా కూడా చాలా కష్టపడుతున్నారని ఈ క్రమంలోనే ఇలాంటి గాయం జరిగిందనే విధంగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. వరుణ్ తేజ్ కు సర్జరీ జరిగిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు కూడా ఆందోళన పడుతున్నారు. దీంతో వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరి వరుణ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి పైన అటు మెగా ఫ్యామిలీ ఏ విధంగా అధికారికంగా స్పందిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం కొరియన్ కనకరాజు అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హర్రర్ కామెడీగా ఉండబోతోంది. ఇందులో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది.