భయానికి కొత్త నిర్వచనం ఒక డార్క్, డేంజరస్ హారర్ థ్రిల్లర్ ..!
ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాటోగ్రఫీ మిర్లాన్ నసీర్, ఎడిటింగ్ వంశీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌కు మంచి స్పందన లభించగా, చిత్ర యూనిట్ రేపు అధికారిక టైటిల్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. వచ్చే నెలనుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోందని యూనిట్ చెబుతోంది. ప్రీ లుక్ పోస్టర్‌తో టైటిల్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా సాంకేతిక బృందం విషయానికి వస్తే బ్యానర్: M3 media, Maha Movies - సమర్పణ : మహర్షి కూండ్ల
నిర్మాత: మహేంద్రనాథ్ కూండ్ల - కథ – దర్శకత్వం: సూర్యాస్ - లిరిక్స్ : ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ - మ్యూజిక్ డైరెక్టర్ : అచ్చురాజమణి - డీఓపీ: మిర్లాన్ నసీర్ - ఎడిటింగ్: వంశీ - పిఆర్‌ఓ: జీకే మీడియా (గణేష్ – కుమార్).