మంచిర్యాల ఎండల మధ్య ‘బ్లాక్ గోల్డ్’ షూటింగ్.. సంయుక్త షాకింగ్ రివీల్!
ఈ సినిమా తాజా షెడ్యూల్ మంచిర్యాల జిల్లాలోని బొగ్గు గనుల నేపథ్యంలో జరిగింది. అయితే అక్కడి వాతావరణం చిత్ర యూనిట్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. 40 నుంచి 45 డిగ్రీల మండే ఎండల్లో షూటింగ్ నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. "మంచిర్యాల మమ్మల్ని అన్ని విధాలా పరీక్షించింది. ఎండలు మండిపోయాయి.. కానీ మా టీమ్ అంతకంటే ధృడంగా నిలబడింది" అంటూ సంయుక్త తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అలసటను, వేడిని లెక్కచేయకుండా అంకితభావంతో పనిచేసిన ప్రతి క్రూ మెంబర్‌కు ఆమె సెల్యూట్ చేశారు.
అంతటి కఠినమైన ఉష్ణోగ్రతల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు డీహైడ్రేషన్ బారిన పడినా, తన పర్సనల్ టీమ్ తీసుకున్న జాగ్రత్తల వల్లే తాను తట్టుకోగలిగానని సంయుక్త తెలిపారు. డైరెక్టర్ యోగి నమ్మకం, నటి నిహారిక కొణిదెల సపోర్ట్ తనకు ఎంతో బలాన్ని ఇచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు. "ఎంత ఎనర్జీతో హైదరాబాద్ నుంచి వెళ్లానో, అంతే ఎనర్జీతో తిరిగి వస్తున్నాను" అని చెబుతూ తన టీమ్ పట్ల ఉన్న గర్వాన్ని చాటుకున్నారు.
కష్టమైన షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంయుక్త, ప్రస్తుతం తిరుపతి చేరుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం తిరుమల గిరులకు చేరుకున్న ఆమె.. తన ప్రయాణంలో అండగా నిలిచిన దేవుడికి, తన టీమ్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు అటు సినిమా ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.సంయుక్త కెరీర్‌లో ‘బ్లాక్ గోల్డ్’ ఒక విభిన్నమైన సినిమా కాబోతోంది. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె నటన మరో లెవల్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. కష్టాలను ఎదిరించి తీస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా ‘గోల్డ్’ లా మెరవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.