విష్ణు ప్రియనే ఫాలో అవుతున్న అనన్య నాగళ్ల..!
నిరంతరం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో, వీడియోలతో రచ్చ చేస్తున్న విష్ణు ప్రియ ఇప్పుడు సబ్ స్క్రిప్షన్ మొదలుపెట్టి మరి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందిస్తోంది. రూ .390 రూపాయలు కడితే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందిస్తామంటూ యూజర్స్ ని సైతం ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు విష్ణుప్రియ బాటలోనే మరో నటి అనన్య నాగళ్ల కూడా అదే పద్ధతిని మొదలుపెట్టింది. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కావాలి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటు ఆఫర్ అందిస్తోంది.
తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం నెలకు రూ. 390 రూపాయలు సబ్స్ట్రిక్షన్ ప్లాన్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇందులో సాధారణంగా ఫాలోవర్స్ కి కనిపించని గ్లామర్ ఫోటో షూట్లు వీడియోలు సైతం, సబ్స్క్రిప్షన్ ప్లాన్ లో కనిపిస్తాయని చెబుతున్నారు. ఇక అనన్య నాగన్న కూడా ఇలాంటి సబ్ స్క్రిప్షన్ పెట్టడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి అనన్య నాగళ్ల సబ్స్క్రిప్షన్ లో ఏం కంటెంట్ ఇస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సబ్స్క్రిప్షన్ విషయంలో యాంకర్ విష్ణుప్రియ పైన కూడా పలు రకాల కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఆమె ఆదాయం రూ.18 లక్షల రూపాయల వరకు పెరిగినట్లు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ సబ్ స్క్రిప్షన్ పద్ధతిని ఎంతమంది సెలబ్రేట్లు కొనసాగిస్తారో చూడాలి.