సైలెంట్ గా సహాయం చేసిన చిరంజీవి... రెండు కుటుంబాలలో వెలుగులు..!
అలా తాజాగా చిరంజీవి సైలెంట్ గా మరో ఇద్దరికి సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడినట్లుగా వినిపిస్తోంది. చిరంజీవి టీమ్ తెలిపిన సమాచారం ప్రకారం.. గత కొంతకాలంగా సిని పరిశ్రమలో మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నటువంటి శివనాథ్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఆయన చికిత్స కోసం ఎదురుచూస్తూ ఉన్న విషయం చిరంజీవికి తెలిసిందని దీంతో దాదాపుగా శివనాథ్ కు రూ. 10.5 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని అందించినట్లు సమాచారం. అంతేకాకుండా తన కుటుంబాన్ని పిలిచి మరి వారికి ధైర్యం చెప్పారు.
అలాగే గతంలో తన దగ్గర మేనేజర్ గా పనిచేసినటువంటి నరసయ్య భార్యకు కూడా అత్యవసరంగా చికిత్స చేయాల్సి ఉందని తన దగ్గరికి రావడంతో రూ.9 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా అపోలో వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ కి అన్ని ఏర్పాట్లు మరి దగ్గరుండి చేయించారట చిరంజీవి. గడిచిన వారం రోజుల క్రితం ఇలా సైలెంట్ గా ఇద్దరికీ వారి సహాయం అందించిన చిరంజీవి ఎక్కడ కూడా ఈ విషయాన్ని చెప్పకపోవడంతో ఈ విషయంపై అటు అభిమానులు నేటిజన్స్ సైతం చిరంజీవిను సైతం అభినందిస్తున్నారు. చిరంజీవి చిత్రాలు విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర చిత్రంతో పాటుగా డైరెక్టర్ బాబి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు.