వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా.. కారణం..?

Divya
టాలీవుడ్ ,బాలీవుడ్ లో హీరోయిన్గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది హీరోయిన్ జెనీలియా. ఈమె బాలీవుడ్ నటుడైన రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించే వివాహం చేసుకుంది. వివాహం అనంతరం పలు చిత్రాలలో నటిస్తున్న ఈ జంట, తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఒక చారిత్రాత్మక చిత్రం శివాజీ మహారాజ్ బయోపిక్ ను వెండితెర పైన ఆవిష్కరించాలనే తన పదేళ్ల కలని రితేష్ ఈ సినిమాతో సహకారం చేసుకున్నారు.


తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెంచేసింది. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రితేష్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ తీవ్రమైన బాగోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్రావు ను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ సినిమా కోసం పడ్డ కష్టం తన భార్య జెనీలియా అందించిన సహకారం గురించి మాట్లాడారు. తన భర్త మాటలు విన్న తర్వాత ఎమోషనల్ గా ఆపుకోలేక వేదిక మీదే ఏడ్చేసింది జెనీలియా. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




అలా జెనీలియా తన భర్త రితీష్ మాట్లాడిన మాటలు చూసి అభిమానులు కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించిన సల్మాన్ ఖాన్ జీవా మహాల్ అనే ఒక పవర్ఫుల్ పాత్రలో నటించారు. అలాగే సంజయ్ దత్, విద్యాబాలన్, అభిషేక్ బచ్చన్ తదితర నటీనటులు ఇందులో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. మొత్తానికి స్టార్ హీరోస్ అందరిని కూడా ఒకే వేదిక పైన తీసుకువచ్చి తన కలను పూర్తి చేసుకున్నాడు రితేష్. మరాఠీ , హిందీ భాషలలో ఏకంగా తెరకెక్కించిన ఈ ఇస్టారికల్  చిత్రం 2026 మే 1వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి రితేష్ దేశ్ ముఖ్ స్వయంగా  దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: