కళ్లు జిగేలుమనేలా బన్నీ కొత్త ఇల్లు..టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఐకాన్ స్టార్ న్యూ మ్యాన్షన్.. బడ్జెట్ ఎంతో తెలుసా..!

Thota Jaya Madhuri
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుంది. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ గుర్తింపును సంపాదించిన ఆయన, తన స్టైల్, యాక్టింగ్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. కేవలం సినిమాల ద్వారానే కాదు, తన వ్యక్తిగత జీవనశైలిలో కూడా అదే స్థాయి విలాసాన్ని ప్రతిబింబిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అల్లు అర్జున్ నిర్మిస్తున్న కొత్త విలాసవంతమైన భవనం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 4,000 గజాల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్న ఈ అద్భుతమైన మ్యాన్షన్, అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటోంది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ఈ భవనం, ఆయన స్థాయి, అభిరుచికి అద్దం పట్టేలా ఉంటుందని సమాచారం.

ఈ ఇంటి ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాని లొకేషన్. మెగాస్టార్ చిరంజీవి నివాసానికి అత్యంత సమీపంలో ఈ భవనం నిర్మించబడుతోంది. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే అల్లు అర్జున్, బంధాలను మరింత బలపరచుకునే ఉద్దేశంతోనే ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.ఇప్పటికే ఈ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలుస్తోంది. అన్ని పనులు పూర్తి అయిన వెంటనే, ఈ ఏడాది చివరి నాటికి అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఈ కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేయనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మొత్తానికి, తన కెరీర్‌లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా అల్లు అర్జున్ తీసుకుంటున్న ప్రతి అడుగు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కొత్త ఇంటి ద్వారా ఆయన లైఫ్ స్టైల్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రసెంట్ బన్నీ ..కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ గా ఉన్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: