డైరెక్టర్ పై నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్..!
నటి ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ లో కూడా ఎన్నో రకాల మెడల్స్ సంపాదించారు. అలాంటి నటి ప్రగతి తాజాగా కొన్ని కామెంట్స్ చేసింది. ముఖ్యంగా తన కెరీర్ కు సంబంధించి పలు కీలకమైన విషయాలను తెలియజేసింది. ఒక దర్శకుడితో పని చేస్తున్న సమయంలో షూటింగ్ చేస్తున్న రెండో రోజే ఎదురైన ఒక చేదు అనుభవం వల్ల తాను చాలా నరకాన్ని అనుభవించానని, దీంతో మళ్లీ అతనితో పని చేయకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రగతి తెలియజేసింది. కథ ,పాత్ర నచ్చకపోతే అవకాశాలనైనా వదులుకుంటాను కానీ , డబ్బు కోసం నచ్చని పాత్రలను చేయలేనని తెలిపింది
తాను డబ్బు కంటే ఎక్కువగా మంచి పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానంటే తెలియజేసింది ప్రగతి. సినిమాలతో పాటు పవర్ లిఫ్టింగ్ పైన ప్రస్తుతం ఆమె దృష్టి పెట్టింది. తన ఫిట్నెస్ విషయంలో కూడా ప్రత్యేకించి మరి శ్రద్ధ పెట్టినట్లు తెలియజేశారు ప్రగతి. రోజుకి రెండు మూడు గంటలైనా సరే వర్క్ అవుట్ చేస్తున్నానని తెలిపింది. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా విషయంపై మాట్లాడుతూ నటన అనేది అన్ని చిత్రాలలో ఒకేలాగా ఉంటుందని అభిప్రాయం తనకి ఉందని, కేవలం బడ్జెట్ ను బట్టి అది చిన్న సినిమా పెద్ద సినిమాగా విభజిస్తారని తెలిపారు. తాను నటించిన సినిమాలలో ఇప్పటివరకు 99% సినిమాలు విడుదలయ్యాయని తెలిపింది.