బ్లాక్‌బస్టర్ కాంబోస్ ఉన్నా..స్టార్‌డమ్ ఎందుకు మిస్ అయ్యింది?

Amruth kumar
గ్లామర్ ఫీల్డ్‌లో టాలెంట్‌తో పాటు కాస్త ‘లక్’ కూడా తోడవ్వాలి. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకుని, ఆ తర్వాత ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్లలో చార్మీ కౌర్ ఒకరు. ఒకప్పుడు కుర్రకారు కలల రాకుమారిగా వెలిగిపోయిన ఈ భామ, తాజాగా తన లేటెస్ట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తున్నారు.

సాధారణంగా సెలబ్రిటీల చైల్డ్‌హుడ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడం సహజం. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న చార్మీ ఫోటో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఆ ఫోటోలో ఆమె చాలా అమాయకంగా, ఇప్పటి రూపానికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.“ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?” అంటూ సాగుతున్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. “అప్పుడు ఇప్పుడు కూడా చార్మీ ఎంతో క్యూట్‌గా ఉంది” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
‘నీతో’, ‘శ్రీ ఆంజనేయం’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చార్మీ, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 


ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి తనదైన ముద్ర వేసింది.
 కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, ‘మంత్ర’, ‘అనుకోకుండా ఒక రోజు’ వంటి సినిమాలతో నటిగా తన విశ్వరూపాన్ని చూపించింది.కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఊహించని విధంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది చార్మీ. అయితే ఆమె ఇండస్ట్రీని వదిలిపెట్టలేదు.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్ పై భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం చార్మీ సినిమాల్లో నటించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన జిమ్ వర్కవుట్స్, వెకేషన్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.ఏదేమైనా, టాలీవుడ్ తెరపై తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్న చార్మీ, నేటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. నటిగా రికార్డులు క్రియేట్ చేసిన ఈమె, నిర్మాతగా కూడా బాక్సాఫీస్ వద్ద మరిన్ని మ్యాజిక్ లు చేయాలని కోరుకుందాం! 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: