హర్రర్ చిత్రం తుంబడ్ 2 రిలీజ్ డేట్ లాక్..!

Divya
భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త హర్రర్ ట్రెండ్ ని సృష్టించిన చిత్రం తుంబాడ్. ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లు తరబడి వేచి ఉన్న అభిమానులకు తాజాగా ఎట్టకేలకు ఒక అదిరిపోయి న్యూస్ అయితే అందించింది. తుంబాడ్ 2 చిత్రం విడుదల తేదీ లాక్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమా 3 డిసెంబర్ 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2018 లో వచ్చిన మొదటి భాగం అందరి చేత ప్రశంసలు అందుకుంది. 2024లో కూడా తుంబాడ్ రీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లతో సునామీ సృష్టించింది.


ఇక అదే ఊపుతోనే అటు హీరో నిర్మాత ఈ సినిమా సీక్వెల్ ని అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు ప్రకటించారు. గతం నేర్పిన పాట భయంకరమైన భవిష్యత్తు ఆకలి పెరుగుతుంది, దురాశ కొనసాగుతోంది అనే ఒక పవర్ ఫుల్ క్యాప్షన్ తో రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ తోనే సినిమా పైన అంచనాలను మరింత పెంచేసినట్టు కనిపిస్తోంది. అలాగే ఈసారి మరుగున పడిన దేవుళ్ళ రహస్యాలను, హస్తర్ పురాణాలలోని కొన్ని రహస్యాలను భారీ స్థాయిలో  చూపించబోతున్నట్లు తెలుస్తోంది.


ఈ సీక్వెల్ లో మరో బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖి ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారట. సోహం షా, నవాజుద్దీన్ ఇద్దరు మంచి యాక్టర్స్ కావడం చేత ఈ సినిమా నటన పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా కోసం ముంబైలో 8 ఎకరాలలో భారీ సెట్ వేసి మరి ఒక నగరాన్ని సృష్టించి షూటింగ్ చేస్తున్నారు. తంబాడ్ చిత్రానికి సహదర్శకత్వం వహించిన ఆదేశ్ ప్రసాద్ ఈ సినిమా సీక్వెల్ ను దర్శకత్వం వహిస్తున్నారు. మరి 2027లో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: