చిరుత స్పీడ్‌లో గోపీచంద్.. కొత్త మూవీ పోస్టర్ హింట్ అదిరింది!

Amruth kumar
టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్షన్ అంటే గోపీచంద్, గోపీచంద్ అంటే యాక్షన్. ఆయన తెరపై కనబరిచే ఇంటెన్సిటీ, ఫైట్స్ చేసే విధానం ఒక రేంజ్‌లో ఉంటాయి. ఇప్పుడు అదే ఇంటెన్సిటీని మరో లెవల్‌కు తీసుకెళ్లేలా, టాలీవుడ్‌లో తిరుగులేని యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పేరున్నవి. వెంకట్ దర్శకత్వంలో గోపీచంద్ ఒక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించడంతో, సినీ వర్గాల్లో ఈ కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సాధారణంగా ఒక హీరో సినిమాకు ఫైట్ మాస్టర్ ఉండటం చూశాం, కానీ ఒక అగ్రశ్రేణి ఫైట్ మాస్టర్ దర్శకత్వం వహిస్తుంటే ఆ యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.టాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలకు అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన వి. వెంకట్, ఇప్పుడు దర్శకుడిగా తన మొదటి అడుగు వేస్తున్నారు. గోపీచంద్ వంటి యాక్షన్ హీరోను ఆయన ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. 34వ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది, ఇది సాధారణ సినిమా కాదని. ఆ పోస్టర్‌లో చిరుతపులి (Cheetah) బొమ్మను ప్రెజెంట్ చేయడం, సినిమా ఎంత వేగంగా, ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో హింట్ ఇచ్చేలా ఉంది.

ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి.ఎస్. ‘ఖైదీ’, ‘మహావతార్ నరసింహా’ వంటి చిత్రాలకు ఆయన అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే. యాక్షన్ హీరో గోపీచంద్‌కు సామ్ సి.ఎస్ ఇచ్చే ఎలివేషన్స్ థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం.ఈ సినిమాకు సంబంధించిన అధికారిక లాంచింగ్ వేడుకలు హైదరాబాద్‌లో మే 3న జరగనున్నాయి.ఈ చిత్రాన్ని 70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అత్యంత భారీగా నిర్మించనుంది.గోపీచంద్ చేతిలో ఇప్పటికే వరుస సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ 34వ చిత్రం కూడా తోడవడంతో, గోపీచంద్ లైనప్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పొచ్చు.“మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్ లో ఇది ఒక ప్రత్యేకం. ఫైట్ మాస్టర్ వెంకట్ గారి విజన్, గోపీచంద్ స్టైల్ కలిస్తే.. థియేటర్లలో యాక్షన్ పండగ ఖాయం.” - సినీ ట్రేడ్ అనలిస్టుల మాట.

గోపీచంద్ కెరీర్‌లో ‘వర్షం’, ‘లక్ష్యం’, ‘సాహసం’ వంటి సినిమాలు యాక్షన్ పరంగా ఒక బెంచ్‌మార్క్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వి. వెంకట్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు కావాల్సిన మాస్ మసాలా అంశాలతో పాటు, కొత్త తరహా యాక్షన్‌ను అందిస్తుందని ఆశించవచ్చు. కథాంశం ఏదైనా, గోపీచంద్ తన బాడీ లాంగ్వేజ్‌తో ఈ చిత్రాన్ని ఒక రేంజ్‌కి తీసుకెళ్తారనేది ఫ్యాన్స్ గట్టి నమ్మకం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: