ఎన్టీఆర్ పక్కన్న పర్ఫెక్ట్ ఫిగర్..‘డ్రాగన్’లో స్టార్ హీరోయిన్ నాటు మాస్ స్పెషల్ సాంగ్ ?
ప్రశాంత్ నీల్ సినిమాలు అంటేనే హై వోల్టేజ్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్, పవర్‌ఫుల్ హీరోయిజం అన్నీ కలిసిన ప్యాకేజ్. ఈసారి కూడా అదే స్థాయిలో కాకుండా, మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆయన ప్లాన్ చేస్తున్నారని టాక్. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇమేజ్‌కు సరిపోయేలా కథను తీర్చిదిద్దేందుకు ఆయన చాలా సమయం కేటాయించాడట. స్క్రిప్ట్ పనులకే ఎక్కువ సమయం తీసుకోవడం వల్లే ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమాలు అన్నీ భారీ విజయాలు సాధించాయి. అందుకే, ఈ కొత్త ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లోనే కాకుండా ఎన్టీఆర్ కెరీర్‌లో కూడా మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ స్పెషల్ సాంగ్ విషయానికి వస్తే, ఇది కేవలం గ్లామర్ కోసం కాకుండా కథలో ఒక కీలక మలుపుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ ఎనర్జీకి తగ్గట్టుగా, నాటు మాస్ స్టైల్‌లో ఈ పాటను డిజైన్ చేయనున్నారని సమాచారం. నూరా ఫతేహి స్టెప్పులు, ఎన్టీఆర్ డాన్స్ కలిస్తే ఈ సాంగ్ థియేటర్లలో బ్లాస్ట్ అవ్వడం ఖాయం అని అభిమానులు ఇప్పటికే ఊహిస్తున్నారు. మొత్తానికి, “డ్రాగన్” అనే ఈ ప్రాజెక్ట్‌పై ప్రతి చిన్న అప్‌డేట్ కూడా భారీ హైప్‌ను సృష్టిస్తోంది. అధికారిక ప్రకటనలు రావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం వస్తున్న వార్తలే సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చేస్తున్నాయి. అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ మ్యాజిక్ ఎప్పుడు చూడబోతామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.