IPL ఎఫెక్ట్.. సమంత మూవీకి బ్రేక్ పడిందా?

Amruth kumar
సమంత ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగించే వార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమె లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) విడుదలకు బ్రేక్ పడింది. వాస్తవానికి ఈ సినిమా మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుత ఐపీఎల్ (IPL 2026) హవా, థియేటర్ల వద్ద తగ్గిన ఫుట్ ఫాల్స్ దృష్ట్యా మేకర్స్ వెనక్కి తగ్గారు.తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని జూన్ 19, 2026న విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 'ట్రలాల మూవింగ్ పిక్చర్స్' అధికారికంగా ప్రకటించింది.

ఐపీఎల్ సీజన్ క్లైమాక్స్‌కు చేరుతుండటంతో యూత్ మొత్తం టీవీలకు అతుక్కుపోతున్నారు. సాయంత్రం ఆటల వల్ల థియేటర్లు వెలవెలబోతున్నాయి. దీనికి తోడు జూన్ 4న రామ్ చరణ్ ‘పెద్ది’ లాంటి భారీ సినిమా బాక్సాఫీస్ వద్దకు వస్తుండటంతో, దానికి కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత వెండితెరపై కనిపిస్తున్న సినిమా ఇది. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల విరామం తీసుకున్న ఆమెకు ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్.

ఈ సినిమా వెనుక ఉన్న టెక్నికల్ టీమ్ అంచనాలను భారీగా పెంచుతోంది. ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ వంటి క్లాసిక్ హిట్స్ ఇచ్చిన నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.సమంత భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (రాజ్ & డికె) ఈ చిత్రానికి షో రన్నర్‌గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇందులో సమంత చీర కట్టుకుని అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ చేసినట్లు టాక్. గృహిణిగా కనిపిస్తూనే, లోపల ఒక పవర్‌ఫుల్ ఫైటర్ దాగి ఉన్న పాత్రలో ఆమె అదరగొట్టబోతోందట.సినిమా వాయిదా పడటం ఒక రకంగా ప్రమోషన్లకు కలిసివచ్చే అంశమే. ఇప్పటి వరకు విడుదలైన ‘తస్సాదియా’ సాంగ్ ఆశించిన స్థాయిలో జనాల్లోకి వెళ్లలేదు. సినిమా కంటెంట్ మీద జనాల్లో ఇంకాస్త బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. జూన్ 19కి ఇంకా సమయం ఉంది కాబట్టి, కొత్త టీజర్లు, మరిన్ని పాటలతో ప్రమోషన్ల హోరు పెంచితే సమంతకు గ్రాండ్ కంబ్యాక్ లభించడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: